● పోలీస్ కమిషనర్ శ్వేత
హసన్‌పర్తి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌ను సోమవారం కమిషనర్ సందర్శించారు. ఈసందర్భంగా స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ మొక్క అందించి కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం సీపీ పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. కమిషనర్ శ్వేత మాట్లాడుతూ.. ఫిర్యాదు చేసిన వారికి రసీదు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఎస్సై దేవేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


