వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దు | - | Sakshi
Sakshi News home page

వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దు

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

వరంగల్‌ క్రైం: నగరంలోని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్ల వద్ద వాహనదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని, బలవంతంగా డబ్బులు అడగడం, వాహనదారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ మేకల రంజిత్‌కుమార్‌ హెచ్చరించారు. సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్లకు బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా వ్యవహరించాలని, సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు పోలీస్‌ శాఖ ఎల్ల ప్పుడూ సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఎక్కడైన బలవంతంగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుబేదారి ఎస్సై ఫణిందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement