ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి టెండర్ల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి టెండర్ల ఆహ్వానం

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి టెండర్ల ఆహ్వానం 437 మంది విద్యార్థుల గైర్హాజరు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ షురూ

మామునూరు: వరంగల్‌ మామునూరు విమానాశ్రయం అభివృద్ధ్ది పనుల కోసం అధికారులు టెండర్లను ఆహ్వానించినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. భూ నిర్వాసితుల నుంచి సేకరించిన రన్‌వే స్థలానికి పెన్సింగ్‌, బోర్డుల ఏర్పాటు, ప్రాంగణంలో ఏపుగా పెరి గిన ముళ్లపొదలు, ఇతర చెట్ల తొలగింపు, విమానాశ్రయంలో భూసార పరీక్షలకు అధికా రులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. 180 రోజుల్లో పర్యావరణ అనుమతులు, భూసార పరీక్షలు నిర్వహించేందుకు టెండర్‌దారులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. కాగా, టెండర్ల దాఖలుకు మంగళవారం సాయంత్రం 4గంటల వరకు చివరి అవకాశం ఉన్నట్లు సమాచారం. టెండర్లను 20న సాయంత్రం 5 గంటలకు ఫైనల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. పనులను దక్కించుకునే కాంట్రాక్టర్‌ 180 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని అఽధికారులు చెబుతున్నారు.

విద్యారణ్యపురి: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో మంగళవారం ఉద యం నిర్వహించిన ఇంటర్‌ ఫస్టియర్‌ జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల పరీక్షల్లో 4,648 మందికిగా ను 4,211 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ ఎ.గోపాల్‌ తెలిపారు. 437 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 1,288 మందికిగాను 1,145 మంది (89శాతం) హాజరుకాగా 143 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్‌ తెలిపారు.

హన్మకొండ అర్బన్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ వీక్‌ సందర్భంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్‌లో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై వర్చువల్‌గా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, స్కిల్‌ యూనివర్సిటీ అవకాశాలపై నిపుణులు విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. యూత్‌ సర్వీసెస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె. వేణుగోపాల్‌ రావు, ఓఎస్డీ డాక్టర్‌ కె. నర్సయ్య, అధికారి పి.మమతా రావు, ఆర్మీ డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌ యాదవ్‌ ఉపాధి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం, సాఫ్ట్‌ స్కిల్స్‌పై వివరించారు. కార్యక్రమంలో నయీమ్‌, మండల పరశురాములు, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యారణ్యపురి: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం సంస్కృతం సబ్జెక్టు జవాబు పత్రాల వాల్యుయేషన్‌ నిర్వహించారు. చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు (అధ్యాపకులు) 49 మంది వాల్యుయేషన్‌ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాకు హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రంగా ఉంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఈ క్యాంపునకు 88,512 జవాబుపత్రాలు కేటాయించారు. మొదటిదశలో ఇంగ్లిష్‌, హిందీ సబ్జెక్టుల పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షల జవాబుపత్రాలు అలాగే మ్యాథ్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌–1 పేపర్‌–2 జవాబు పత్రాల వాల్యుయేషన్‌ నిర్వహించనున్నట్లు క్యాంప్‌ ఆఫీసర్‌, డీఐఈఓ ఎ.గోపాల్‌, ఏసీఓ జనరల్‌–1 శ్రీనివాస్‌రావు తెలిపారు. రెండో దశలో ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కామర్స్‌, హిస్టరీ సబ్జెక్టుల పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్‌ ఈనెల 24 నుంచి నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement