అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

వరంగల్‌ అర్బన్‌ : జీడబ్ల్యూఎంసీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల పురోగతి, స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాలు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌ మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ యూజీడీ డీపీఆర్‌లో కోరిన అంశాలను వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. నగరంలోని 66 ప్రాంతాల్లో హైమాస్ట్‌ లైట్ల టెండర్‌ పూర్తయినందున పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఒప్పంద కార్మికుల కారుణ్య నియామకాల అంశంపై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. మొత్తం 117 దరఖాస్తులు అందగా, వాటిలో 86 దరఖాస్తులను మంజూరు చేసినట్లు, మిగిలినవి నిబంధనల మేరకు లేకపోవడంతో తిరస్కరించినట్లు కలెక్టర్‌కు వివరించారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, సిటీ ప్లానర్‌ రవీంద్ర రాడేకర్‌, సీహెచ్‌ఓ రమేశ్‌ పాల్గొన్నారు.

భవన నిర్మాణాల్లో నిబంధనలు పాటించాలి

నగర పరిధిలో భవన నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో పాటిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని హనుమకొండ కలెక్టర్‌, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మంగళవారం హనుమకొండలోని ప్రశాంత్‌నగర్‌, అశోక్‌ కాలనీ, సిద్ధార్థ్‌నగర్‌, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను కలెక్టర్‌ ప్రత్యక్షంగా పరిశీలించారు. సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, టీపీఎస్‌ అవినాష్‌ అధికారులున్నారు.

పెండింగ్‌ అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలి..

జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి,

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement
 
Advertisement
Advertisement