కాజీపేట రూరల్: సమాజంలో మానసిక అనారోగ్యం, మేథో వైకల్యం ఉన్న వారికోసం ప్రభుత్వం అందిస్తున్న మనోన్యాయ్‌ను వినియోగించుకోవాలని హనుమకొండ పారిశ్రామిక ట్రెబ్యునల్, కార్మిక న్యాయస్థానం, మొదటి అదనపు జిల్లా జడ్జి డాక్టర్ తట్టా శ్రీనివాస్‌రావు అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ మిషనరీస్ ఆఫ్‌దిపూర్ హౌస్ ఆఫ్‌జాయ్‌లో మంగళవారం తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ హనుమకొండ వారి ఆధ్వర్యంలో మనోన్యాయ్–న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా న్యాయమూర్తి శ్రీనివాస్‌రావు హాజరై మాట్లాడుతూ.. మనోన్యాయ్ అనేది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎన్‌ఎఎల్ ఎస్‌ఎ) కింద మానసిక రుగ్మతలు ఉన్నవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లీగల్ సర్వీసెస్ యూనిటీ (ఎల్‌ఎస్‌యూఎం) అన్నారు. న్యాయసేవల అధికారాల చట్టం ప్రకారం సమాజంలోని అట్టడుగు వర్గాలతో పాటు వైకల్యాలున్న వ్యక్తులకు ఉచిత, సమర్థ న్యాయసేవలను ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త చిలువేరు శంకర్, మిషన్ సుపీరియర్ బ్రదర్ సైమన్, రీజినల్ సుపీరియర్ ఆఫ్ ఇండియా బ్రదర్ వినోద్, బ్రదర్ జార్జ్, హౌజ్ ఆఫ్ జాయ్ ఇన్‌చార్జ్ బ్రదర్ థామస్, సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయమూర్తి శ్రీనివాస్‌రావు
ఫాతిమా హౌస్ ఆఫ్ జాయ్‌లో
న్యాయవిజ్ఞాన సదస్సు


