డయాగ్నొస్టిక్‌ సెంటర్లు నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

డయాగ్నొస్టిక్‌ సెంటర్లు నిబంధనలు పాటించాలి

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

డయాగ్నొస్టిక్‌ సెంటర్లు నిబంధనలు పాటించాలి

హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి

హన్మకొండ అర్బన్‌: ప్రైవేట్‌ క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, ఆస్పత్రులు తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం నిబంధనలను తప్పకుండా పాటించాలని హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రిజిస్ట్రింగ్‌ అథారిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎంహెచ్‌ఓ అప్పయ్య నిర్వహించిన తనిఖీలు, జారీ చేసిన నోటీసులు, తీసుకున్న చర్యల వివరాలను సభ్యులకు వివరించారు. జిల్లాలో 780 ప్రైవేట్‌ క్లినిక్‌లు, ఆస్పత్రులతో పాటు 118 ప్రభుత్వ డిస్పెన్సరీలు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులు రిజిస్టర్‌ చేసినట్లు తెలిపారు. ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, పరకాల ఆర్డీఓ నారాయణ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ ముక్క దిలీప్‌కుమార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, స్టాటిస్టికల్‌ అధికారి జి.ప్రసన్నకుమార్‌, డెమో వి.అశోక్‌ రెడ్డి, సురేఖ పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ వేగవంతం చేయాలి..

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, బీఎల్‌ఓలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను తొలగించాలన్నారు. ఆర్డీఓలు రాథోడ్‌ రమేశ్‌, డాక్టర్‌ కన్నం నారాయణ, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, జగత్‌సింగ్‌, రవీందర్‌రెడ్డి, బీఎల్‌ఓలు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement