రెసిడెన్సీ స్కూల్‌ను ఎస్సీ హాస్టల్‌ భవనంలోకి మార్చాలి | - | Sakshi
Sakshi News home page

రెసిడెన్సీ స్కూల్‌ను ఎస్సీ హాస్టల్‌ భవనంలోకి మార్చాలి

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

కాళోజీ సెంటర్‌ : నర్సంపేట అర్బన్‌ రెసిడెన్సీ బాలల పాఠశాలను నర్సంపేట ఎస్సీ హాస్టల్‌ భవనంలోకి మార్చాలని ఏబీఎస్‌ఎఫ్‌ వరంగల్‌ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్‌ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల పేర్ల ముందు టెక్నో, డిజీ, ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ పేర్లతో ప్రచారం చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తూ తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజు వసూలు స్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లి వివరణ కోరే ప్రయత్న చేయగా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో లేకపోవడం బాధాకరం అన్నారు. డీఆర్‌ఓకు వినతి పత్రం అందజేసిన వారిలో ప్రశాంత్‌, రమేష్‌, శ్రీకాంత్‌, వినయ్‌ ప్రసాద్‌, రాజశేఖర్‌, ప్రమోద్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement