విద్యారణ్యపురి : తెలంగాణా రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ సమగ్ర చట్టం రూపొందించి పకడ్భందీగా అమలు చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. న ర్సింహారావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం పీడీఎస్‌యూ హనుమకొండ, వరంగల్ జిల్లా క మి టీల ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రా జేందర్‌రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రా ష్ట్రంలో పేద , మధ్య తరగతి ప్రజలకు భారం తొలగించేందుకు విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కమిటీ వేశారని తెలిపారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించిన వారిలో పీడీఎస్‌యూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి అజయ్, జిల్లా ఉపాధ్యక్షులు పి.అనూష, జిల్లా నాయకులు వంశీ, వినయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


