హసన్‌పర్తి : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మా జీ సర్పంచ్ పుల్లా రవీందర్ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే నాగరాజును మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీందర్‌ను శా లువతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి, గరిగె రాజు, ప్రకాష్, పోలెపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు


