కాజీపేట అర్బన్ : ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా హార్ట్ సర్జరీ చేసి మూడు సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న రంధ్రానికి హార్ట్ సర్జరీని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశా రు. హంటర్‌రోడ్డులోని మెడికవర్ హా స్పిటల్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెడికవర్ కన్సల్టెంట్ ఇంటర్వేన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మోదాని వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన 38 ఏళ్ల మహిళ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటూ మెడికవర్‌లో ఇటీవల చేరింది. వైద్యపరీక్షల అనంతరం 3 సెంటీమీటర్ల పెద్ద ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఏస్డీ)గా నిర్ధారణ అయింది. ఏఎస్డీ డివైస్ క్లోజర్ విధానం ద్వారా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో హార్ట్ సర్జరీ నిర్వహించాం. కార్యక్రమంలో మెడికవర్ వైద్యులు పాల్గొన్నారు.


