ఖిలా వరంగల్ : జూన్ 20, 21 తేదీల్లో శ్రీమెట్ల బావి ధనమైసమ్మ దేవాల యం తృతీయ వార్షికోత్సవం వైభవపేతంగా నిర్వహిద్దామని, భక్తులు పెద్ద ఎ త్తున తరలివచ్చి విజయవంతం చేయాలని గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, అధ్యక్షుడు తోట బాబన్న పిలుపునిచ్చారు. మంగళవా రం శివనగర్ శివసాయినగర్ కాలనీలోని ధనమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ముఖ్య అతిథులుగా దిడ్డి కుమారస్వామి, కరాటే ప్రభాకర్, వడ్డె కోటేశ్వర్‌రావు, మేరుగు అశోక్, పగడాల సతీష్, మెంగని నరేష్,తోట ప్రసాద్‌తో కలిసి ధనమైసమ్మ తృతీయ వార్షికోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


