ఖిలా వరంగల్ : వరంగల్ 38వ డివిజన్ మధ్యకోటలోని పంట పొలాల్లో డ్రెయినేజీ మురుగు నీరు ప్రవహిస్తోంది. అధికారులు సరైన డ్రెయినేజీలు ని ర్మించకపోవడంతో మురుగునీరు సాగు భూమిలోకి వదిలేశారు. దీంతో పలు కాలనీల నుంచి డ్రెయినేజీ ద్వారా వచ్చే మురుగునీరు సుమారు నాలుగు ఎకరాల్లో విస్తీర్ణంలో నిలిచి కుంటను తలపిస్తోంది. ఇంతకాలం ఆకుకూరల తోటలపై ఆధారపడి జీవనం సాగించిన రైతులు రెండేళ్లుగా ఆర్థికంగా నష్టపోయి జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా గ్రీవెన్ సెల్‌లో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని బా ధిత రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా చట్టుపక్క బావుల్లోని నీరంతా మురుగు వాసన వస్తున్నాయని, ఆకుకూర తోటలన్నీ దెబ్బతింటున్నాయని రైతులు చెబుతున్నారు. అంతేకాదు నీటినిల్వతో దుర్వాసన వ్యాపించి దోమలకు ఆవాస కేంద్రాలు మారిపోయాయన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి పరిశీలిస్తామని చెప్పడం వరకు మాత్రమే తప్ప ఏ అధికారి ముందుకు రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికై నా బల్దియా అధికారులు స్పందించి మురుగునీటి ప్ర వాహానికి ఆడ్డుకట్టవేసి నష్టపోయిన రైతులకు బ ల్దియా అధికారులు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తగ్గుతున్న దిగుబడి
ఆర్థికంగా నష్టపోతున్న రైతులు


