నిరాడంబర జీవితం నిబద్దత, త్యాగం ప్రజల పట్ల అంకితభావం నేటి తరానికి పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శమని సీపీఎం జిల్లా వరంగల్, హ నుమకొండ జిల్లాల కార్యదర్శులు సీహెచ్.రంగ య్య, జి.ప్రభాకర్ అన్నారు. మంగళవారం వరంగల్ ఉర్సు గుట్ట, హనుమకొండలో సీపీఎం పార్టీ కార్యాలయాల్లో, హనుమకొండలోని సీపీఎం నార్త్ ఏరియా కమిటీ ఆ ధ్వర్యంలో 4వ డివిజన్ జ్యోతి బస్‌నగర్ ఫేస్–2లో సుందరయ్య 41వ వర్ధంతి ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటా నికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సింగారపు బాబు, జిల్లా కమి టీ సభ్యులు నలిగంటి రత్నమాల, దుర్గయ్య, రా మసందీప్, ఉదయ్, వెంకట్, వీరన్న, రాములు, సాంబయ్య, రమాదేవి, ఉ పేందర్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.చక్రపాణి, నాయకులు గాదె రమేశ్, ఇంజపల్లి రా జే, అడప తార, నవీన్, అభిరామ్, రమణాచారి, రజిత, రాధిక, కోటి, ఇస్మాయిల్, కిరణ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
– సాక్షి, నెట్‌వర్క్


