సస్పెన్స్‌గా ధర్మకర్తల మండళ్లు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌గా ధర్మకర్తల మండళ్లు ఏర్పాటు

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

కాశిబుగ్గ: ఎట్టకేలకు కాశిబుగ్గ ఓ సిటీలోని సీ తా రామాంజనేయస్వామి, రంగనాథ ఆలయాలకు ధ ర్మకర్తల మండలిని నియమించారు. కొన్నేళ్ల నుంచి ఈ రెండు దేవాలయాలకు కమిటీల నియామకంలో సస్పెన్స్‌గా కొనసాగుతోంది. ఇదే తరహాలో ఎ వరి కీ తెలియకుండా ఆయా దేవాలయాలకు నియమించిన కమిటీ సభ్యుల పేర్లు ప్రమాణస్వీకా రం చేసే వరకు సస్పెన్షన్‌లో ఉంచారు. ఎలాంటి ఆర్భాటంలేకుండా ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు.

సీతారామాంజనేయస్వామి

ధర్మకర్తల ప్రమాణ స్వీకారం

ఆలయ ధర్మకర్తలుగా దాసరి రాజేష్‌, వెలిశాల మధుమతి, పోతన లక్ష్మినర్సయ్య, కుడికాల కోటి, లకుం భాస్కర్‌, ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా పురోహితుడు కాండూరి మధుచార్యుల నియమించారు. ఆలయ చైర్మన్‌గా దాసరి రాజేష్‌ను ఎన్నుకున్నారు. అనంతరం ధర్మకర్తలను ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మీసాల ప్రకాశ్‌, వెలిశాల ఆనందకుమార్‌, నీలం శ్రీనివాస్‌, సతీష్‌, విశాల్‌, శ్రీకాంత్‌, వినయ్‌, సుదర్శన్‌, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

రంగనాథస్వామి ఆలయ ధర్మకర్తలు..

కాశిబుగ్గలోని శ్రీ రంగనాథస్వామి ఆలయ ధర్మకర్తలుగా గోషికొండ శకుంతల సుధాకర్‌, నీలం అరుణ శ్రీనివాస్‌, పల్లకొండ రాజమణి రమేష్‌, మెడికుర్తి లోకేష్‌, పిట్టల కోటి, ఆలయ పురోహితుడు ఆరుట్ల కృష్ణమాచార్యులను నియమించారు. అనంతరం ఆలయ చైర్మన్‌గా గోషికొండ శకుంతలను ఎన్నుకున్నారు. ఆలయ ఈఓ ఎన్‌.వెంకట్రావ్‌, ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ధర్మకర్తలను ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

రంగనాథస్వామి, సీతారామాంజనేయస్వామి ఆలయాలకు నియామకం

Advertisement
 
Advertisement
Advertisement