సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

కేయూ క్యాంపస్‌ : తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయస్సు వరకు పెంపుదల నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్‌ నాయకులు, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కేయూ మొదటిగేట్‌ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ మేడారపు సుధాకర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి నరేష్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాల నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయటం వలన నిరుద్యోగులు పది సంవత్సరాల కాలం వృథా అయిందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు అభిరామ్‌, రమేష్‌, సాయివికాస్‌, రమేష్‌చంద్ర, సురేష్‌గౌడ్‌, మహేందర్‌, అరుణ్‌కుమార్‌, కుమారస్వామి, కార్తీక్‌, సాయిరాం, రాంచందర్‌ పాల్గొన్నారు.

డీసీసీ ప్రధాన కార్యదర్శి

రాజేశ్వర్‌కు సన్మానం

హన్మకొండ : హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి కరాబు రాజేశ్వర్‌రావును ఆరె సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. మంగళవారం హనుమకొండలోని ఆరె సంక్షేమ సంఘం భవనంలో రాజేశ్వర్‌రావు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకుల శాలువా కప్పి, పుష్పగుచ్చం, జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఆరెలకు కాంగ్రెస్‌ పార్టీ సముచిత స్థానం కల్పించిందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ నాయకులు కొల్లూరి కండేరావు, కిషన్‌ రావు, లింగమూర్తి, దీపక్‌, నిరంజన్‌ రావు, సుధాకర్‌, భాస్కర్‌, కిషన్‌ రావు, గోపాల్‌, వాడికారి లక్ష్మణ్‌ రావు, ఆదరసాని చందర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement