హనుమాన్‌ విగ్రహాన్ని తొలగించడం దారుణం | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ విగ్రహాన్ని తొలగించడం దారుణం

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

కాజీపేట అర్బన్‌ : అంజన్న స్థలం అంజన్నకే కా వాలి, హనుమాన్‌ విగ్రహాన్ని తొలగించడం దా రుణం అంటు నినాదాలు చేస్తు న్యూశాయంపేట చౌరస్తాలో మంగళవారం హనుమాన్‌ భక్తులు, గ్రా మస్తులు ధర్నాకు దిగారు. న్యూశాయంపేటలోని ఆంజనేయస్వామి దేవాలయానికి ఆనుకుని ఉన్న గుట్ట, కుంటలా ఉన్న స్థలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు భద్రకాళీ బండ్‌ పూడికతీత మట్టితో పూడ్చారు. కాగా హనుమాన్‌ భక్తులు, గ్రామస్తులు గుట్టకు ఆనుకుని హనుమాన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం రెవెన్యూ, పోలీస్‌ అధి కారులు ఇట్టి భూమి ప్రభుత్వానిది, కుడాకు అప్పగించామని ఎవరు కూడా భూమి మీదకు రాకూడదని హెచ్చరించినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున విగ్రహాన్ని తొలగించడంతో గ్రా మస్తులు, హనుమాన్‌ భక్తులు ఆందోళన దిగి ధర్నా చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి పీఎస్‌కు తరలించారు.

ఆక్రమణకు యత్నిస్తే చర్యలు : తహసీల్దార్‌

న్యూశాయంపేటలోని సర్వే నంబర్‌ 22 ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చాకలి ఐలమ్మ విగ్రహా నికి, రజక భవనానికి స్థలాన్ని గతంలోనే కేటాయింపు జరిగింది. మిగతా భూమిని కుడాకు పదేళ్ల క్రితం అప్పగించడం జరిగింది. భద్రకాళి బండ్‌ పూడికతీత మట్టితో గుట్టకు ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని పూ డ్చారు. ఎవరైనా అక్రమణకు యత్నిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం.

న్యూశాయంపేట చౌరస్తాలో

హనుమాన్‌ భక్తుల ధర్నా

Advertisement
 
Advertisement
Advertisement