హన్మకొండ కల్చరల్ : కాళేశ్వరం వద్ద ప్రవహించే సరస్వతి నది అంత్య పుష్కరాలను ప్రారంభించడానికి కంచికి చెందిన శ్రీకంచి కామకోటి పీఠం కాంచీపురం జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ నగరానికి వచ్చిన సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామీజీని ఘనంగా స్వాగతించారు. మంగళవారం సాయంత్రం వరంగల్ హంటర్‌రోడ్‌లోని సంతోషిమాత దేవాలయం దగ్గర వేదపండితులు, వందలాది బ్రాహ్మణులు పాల్గొని స్వామీజీని మంగళవాయిద్యాలతో వేదమంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యమైన కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద గల త్రివేణి సంగమం తీరంలో సరస్వతి నదికి రేపటి నుంచి జూలై 1వ తేది వరకు సరస్వతి నది అంత్యపుష్కరాలను మంత్రులు కొండా సురేఖ, దుద్దిల్ల శ్రీధర్‌బాబు, వివిధ శాఖా మంత్రులతో కలిసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణసేవా సమితి గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ పుష్కరకాలంలో ప్రతిరోజు వేదపండితుల ఆధ్వర్యంలో మహాగణపతి హోమం, హయగ్రీవహోమం, నవగ్రహహోమం, మహాసుదర్శనహో మం తదితర హోమాలు మహాపూర్ణాహుతి జరుగుతుందని పేర్కోన్నారు. కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే వోడితెల సతీష్‌కుమార్, రాజేశ్వరశర్మ, లంక శివకుమార్‌శర్మ, రత్నాకర్‌శర్మ, మణికంఠశర్మ, ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.


