కాటన్‌ వ్యాపార విస్తరణ అవకాశాలపై సదస్సు | - | Sakshi
Sakshi News home page

కాటన్‌ వ్యాపార విస్తరణ అవకాశాలపై సదస్సు

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

ఖిలా వరంగల్‌ : ముంబయిలోని క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, కోచ్‌ బెహార్‌ హాల్‌లో ఇంటర్నేషనల్‌ కా టన్‌ అసోసియేషన్‌, కాటన్‌ అసోసియేషన్‌ అఫ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ కా టన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పియర్‌ చహాబ్‌, ఎండీ బిల్‌కింగ్‌డన్‌ అధ్యక్షతన అంతర్జాతీయ కాటన్‌ సాంకేతికతలు, రిస్కిమెనేజ్‌మెంట్‌, వ్యాపార విస్తరణ అవకాశాలపై శిక్షణ ముగింపు సదస్సు మంగళవారం జరిగింది. ముఖ్యఅతిథులుగా కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు ఎన్‌.వినయ్‌ కో టక్‌, సీఏఐ మాజీ అధ్యక్షుడు అతుల్‌ గంట్రా, కా టన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఎండీ లలిత్‌ కు మార్‌ గుప్తా, వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌కామర్స్‌ అధ్యక్షుడు, తెలంగాణ కాటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, సీఏఐ డైరెక్టర్‌ బొమ్మినేని రవీందర్‌రెడ్డి, సీఏఐ డైరెక్టర్లు అంతర్జాతీయ కాటన్‌ సాంకేతిక రంగ నిపుణులు డాక్టర్‌ రాబర్ట్‌ జియాంగ్‌, జేమీ వెల్ష్‌ హాజరయ్యారు. అంతర్జాతీయ కాటన్‌ సాంకేతిక రంగ నిపుణులు అంతర్జాతీయ కాటన్‌ సాంకేతిక, వ్యాపార పోకడలపై అవగాహన కల్పించారు. అ నంతరం సీఏఐ, ఐసీఏ మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నారు. సమావేశంలో అంతర్జాతీయ సభ్యులు, వరంగల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement