సంక్షిప్త సమాచారం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్త సమాచారం

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

సంక్షిప్త సమాచారం

పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి

వరంగల్‌ చౌరస్తా : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐసీటీయూ వరంగల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హెడ్‌ పోస్టాఫీస్‌ సెంటర్‌లో పెంచిన ధరల పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

22న వాహనాల వేలం

ఖిలా వరంగల్‌ : ఎకై ్సజ్‌ శాఖ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు 22న ఉదయం మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో వేలం నిర్వహించనున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ బొల్లం రమేశ్‌ మంగళవారం తెలిపారు. ఆసక్తిగల వారు వేలంలో పాల్గొని నచ్చిన వాహనాలను దక్కించుకోవాలని ఇన్‌స్పెక్టర్‌ కోరారు.

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి

హసన్‌పర్తి : ఉపాధి హామీ పథకం కూలీల పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి రాములు డిమాండ్‌ చేశారు. పుచ్చపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని మండలంలోని పెంబర్తిలో, నగరంలోని 1వ డివిజన్‌ పలివేల్పులలో మంగళవారం నిర్వహించారు. అనంతరం రాములు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల గ్రామీణ పేదప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement