దామెర : మండలంలోని పులుకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బానోతు జుమ్మును ఎంఈఓగా నియమించారు. కాగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
నేడు విద్యుత్
ఉండని ప్రాంతాలు
హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 20న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని డివిజన్ డీఈ జి.సాంబరెడ్డి తెలి పారు. విష్ణుపురి, సోమిడిలోని తిరుపతి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
లక్ష పూలతో
అంజన్నకు అలంకరణ
కాజీపేట: 63వ డివిజన్ జుబ్లీ మా ర్కెట్ ఆవరణలో కొలువుదీరిన దక్షిణ ము ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవా రం లక్ష మల్లెలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయుడికి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక అలంకరణ పూజలు జరిపించారు. పూజల్లో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు అనువంశీక ధర్మకర్తలు పాల్గొన్నారు.
మేరు కార్పొరేషన్ చైర్మన్‌కు సన్మానం
కాశిబుగ్గ : వరంగల్ కాశిబుగ్గలోని రాణి రుద్రమదేవి మేరు మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజంను సన్మానించారు. మంగళవారం తిలక్‌రోడ్డులో వెంకట్రాజం దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాణి రుద్రమదేవి మేరు మహిళా పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
కుమారస్వామికి డాక్టరేట్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగం పరిశోధకుడు సిహెచ్.కుమారస్వామికి యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది.రోల్ ఆఫ్ రీజినల్ పొ లిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా విత్ స్పెషల్ రి ఫరెన్స్ టు తెలంగాణ స్టేట్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి గాను కుమారస్వామికి డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. ఆ విభాగం ప్రొఫెసర్ రామచంద్రం పర్యవేక్షణలో కుమారస్వామి తన పీహెచ్‌డీ పూర్తిచేశారు.
28 నుంచి జాతీయ సమితి సమావేశాలు
కాశిబుగ్గ : ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో ఈ నెల 28 నుంచి 30 వరకు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఎ దుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, భూ మి పంపకం, ఉపాధి, సంక్షేమ పథకాలు, మ హిళలపై జరుగుతున్న దాడులు, సామాజిక న్యాయంపై సమావేశాల్లో చర్చిస్తారని పేర్కొన్నారు. కా ర్మికులందరూ పాల్గొని సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
డీసీసీ ప్రధాన కార్యదర్శి
రాజేశ్వర్‌కు సన్మానం
హన్మకొండ : హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కరాబు రాజేశ్వర్‌రావును ఆరె సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. మంగళవారం హనుమకొండలోని ఆరె సంక్షేమ సంఘం భవనంలో రాజేశ్వర్‌రావు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకుల శాలువా కప్పి, పుష్పగుచ్చం, జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఆరెలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందన్నారు. సంఘం జిల్లా కమిటీ నాయకులు కండేరావు, కిషన్ రావు, లింగమూర్తి, దీపక్, నిరంజన్ రావు, సుధాకర్ పాల్గొన్నారు.


