గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

జెడ్పీ సీఈఓ శేషాద్రి

దామెర : గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పీ సీఈఓ శేషాద్రి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం అన్ని గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి దేశ ప్రగతికి మూలస్తంభమని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల క ల్పనకు కృషి చేయాలని సూచించారు. అదే విధంగా ఘన వ్యర్థ్ధ పదార్థ్ధాల నిర్వహణను ప్రణాళికబద్ధంగా చేపట్టాలన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి రీసైకిల్‌ చేయాలన్నారు. వాతావరణ కాలుష్యం నివారణ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌తో సాధ్యమన్నారు. అనంతరం మండల కేంద్రంలో బాలికల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న స్నేహ సమ్మర్‌ క్యాంపును సందర్శించారు. ఎంపీడీఓలు గుమ్మడి కల్పన, రంగాచారి, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement