ఎల్కతుర్తి : వర్షాకాలం పంట భూముల్లో భూసారాన్ని పెంచేందుకు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్, ఎల్‌ఎస్‌సీఎస్ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, గ్రామ సర్పంచ్ లావణ్య ప్రారంభించారు. పలువురు రైతులకు జీలుగ విత్తనాల బ్యాగులు అందించారు. మిగతా రైతులకు విశాల సహకార సంఘంలో మరో రెండు రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, సాంకేతిక, కమలాకర్, ఏఈఓలు పూర్ణచందర్, తిరుపతి రైతులు పాల్గొన్నారు.


