హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో ఆరోగ్య రక్షణ | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో ఆరోగ్య రక్షణ

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

ఆత్మకూరు : హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేసుకుంటే బాలికలకు జీవిత కాలం వివిధ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో ఈ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్నట్లు వైద్యధికారిణి డాక్టర్‌ స్పందన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తున్నామని, గ్రామాల్లో ఆశ కార్యకర్తలు కూడా ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ అవశ్యకతపై వివరిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 31మంది బాలికలు వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు చెప్పారు.

వ్యాక్సిన్‌ ఎవరు వేసుకోవాలి..

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఫిబ్రవరి 26, 2011 నుంచి ఫిబ్రవరి 25, 2012 మధ్య జన్మించిన బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేసుకోవాలి. 14 ఏళ్లు నిండిన బాలికలు వ్యాక్సిన్‌కు అర్హులు. బాలికులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని ప్రభుత్వ వైద్యులు సూచి స్తున్నారు.

వ్యాక్సిన్‌తో వ్యాధులు దూరం..

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ బాలికల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్‌ నివారణకు సహాయపడుతుంది. జననేంద్రియ మసూరికలు రావడం తగ్గుతుంది. అలాగే ఆనల్‌, యోని, వల్వా, గొంతు క్యాన్సర్‌లు రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ కాపాడుతోంది. చిన్న వయసులో టీకా వేసుకోవడం వల్ల ఎక్కువ రక్షణ పొందవచ్చు. 14 ఏళ్లు నిండిన బాలికలు భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేసుకోవాలి. దీంతో అనేక ఆరోగ్య పరమైన లాభాలు ఉన్నాయని ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇప్పటి వరకు 31 మందికి పంపిణీ

ప్రత్యేక దృష్టి సారిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ

Advertisement
 
Advertisement
Advertisement