దుండగులను శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

దుండగులను శిక్షించాలి

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

సంక్షిప్తంగా

ఆత్మకూరు : హనుమకొండ న్యూశాయంపేటలో హనుమాన్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని హనుమాన్‌ గురుస్వామి కందుకూరి నరేష్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని కామారం గ్రామంలో మంగళవారం హనుమాన్‌ దేవాలయం వద్ద ఆయన మాట్లాడుతూ.. నిరసన తెలుపుతున్న వారినే అక్రమంగా అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో హనుమాన్‌ స్వాముల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నేడు పర్యాటక ఉత్సవం

ఆత్మకూరు : మండలంలోని కటాక్షపూర్‌లో గల త్రికూట శివాలయం వద్ద ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నేడు (బుధవారం) పర్యాటక ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక ప్రేమికులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

హనుమాన్‌ దేవాలయంలో చోరీ

ఆత్మకూరు : మండలంలోని గూడెప్పాడ్‌లో గల హనుమాన్‌ దేవాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. సీఐ సంతోశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గూడెప్పాడ్‌లోని హనుమాన్‌ దేవాలయంలో సోమవారం రాత్రి ఆలయం మూసిన తర్వాత చోరీ జరిగిందని, మంగళవారం తె ల్లవారుజామున ఆలయ గర్భగుడి తెరిచి ఉండడంతో స్థానికులు గమనించినట్లు తెలిపారు. రెండు వెండి శఠగోపాలు, రెండు వెండి ప్లేట్లు, ఒక వెండి గధా, ఒక వెండి గిన్నె, ఒక వెండి చెంచా మొత్తం రూ.2.43 లక్షల విలువ చేసే 1.08 కిలోల వెండి చోరీ అయినట్లు ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్‌ కందికొండ రఘుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోశ్‌ తెలిపారు.

గుర్తు తెలియని వాహనం

ఢీకొని యువకుడి దుర్మరణం

నడికూడ : గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రామకృష్ణపూర్‌ గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, దామెర పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఆకారపు క్రాంతి కుమార్‌(37) బైక్‌పై వరంగల్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మండలంలోని కంఠాత్మకూరు–రామకృష్ణపూర్‌ గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా బైక్‌పై నుంచి ఎగిరి పక్కనే కాలుతున్న పంట అవశేషాల్లో పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. శాయంపేట సీఐ సుధాకర్‌ రెడ్డి, దామెర ఎస్సై కొంక అశోక్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి సుధాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీస్‌లు తెలిపారు. పంట అవశేషాలను కా ల్చడం కారణంగా దట్టంగా పొగ కమ్ముకోవడంతో కంఠాత్మకూరు నుంచి ఆరేపల్లి వైపు వాహనాలను దారి మళ్లించారు. మృతుడికి భార్య, ఏడాదిన్నర బాబు ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement