మహిళలు, బాలికల రక్షణకే షీటీంలు | - | Sakshi
Sakshi News home page

మహిళలు, బాలికల రక్షణకే షీటీంలు

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

ఎస్సై స్వాతి

దామెర : మహిళలు, బాలిక రక్షణకే షీటీంలు పని చేస్తున్నట్లు షీటీం ఎస్సై స్వాతి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్నేహ సమ్మర్‌ క్యాలెండర్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే షీటీంలను సంప్రదించాలన్నారు. పోకిరీల వివరాలు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను షీటీంలకు తెలుపాలన్నారు. అదే విధంగా ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులతో సోషల్‌ మీడియాలో చేస్తున్న స్నేహంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేశ్‌, ఏపీఓ అశోక్‌, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలి

హసన్‌పర్తి : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మా జీ సర్పంచ్‌ పుల్లా రవీందర్‌ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే నాగరాజును మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీందర్‌ను శా లువతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ సర్కార్‌ అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి, గరిగె రాజు, ప్రకాష్‌, పోలెపాక అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

కేయూ క్యాంపస్‌ : తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయస్సు వరకు పెంపుదల నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్‌ నాయకులు, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కేయూ మొదటిగేట్‌ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ మేడారపు సుధాకర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి నరేష్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాల నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయటం వలన నిరుద్యోగులు పది సంవత్సరాల కాలం వృథా అయిందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు అభిరామ్‌, రమేష్‌, సాయివికాస్‌, రమేష్‌చంద్ర, సురేష్‌గౌడ్‌, మహేందర్‌, అరుణ్‌కుమార్‌, కుమారస్వామి, కార్తీక్‌, సాయిరాం, రాంచందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement