● ఆర్డీఓలు డాక్టర్ నారాయణ, రమేశ్‌రాథోడ్
దామెర : జనగణనకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సెన్సస్, సర్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. జన గణన కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు మొదటి విడత గృహ గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. అదే విధంగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఓటర్ల జాబితాలో సమగ్రతను తీసుకువచ్చేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు నకిలీ ఓట్లను తొలగించడమే సర్ ఉద్దేశమని అన్నారు. త్వరలో బీఎల్‌ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు దుబాసి రాజేందర్, గండు రాము, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : గృహగణనను సకాలంలో పూర్తి చేయాలని ఆర్డీఓ, అడిషనల్ సెన్సెస్ అధికారి రమేశ్‌రాథోడ్ సిబ్బందికి సూచించారు. మంగళవారం మండలంలోని దామెర, బావుపేటలో కొనసాగుతున్న గృహ గణనను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జనాభా, గృహాల లెక్కలు నమోదు చేస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ పద్ధతిలో జనాభా గణనను నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎల్కతుర్తి మండలంలో 70మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, 12 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రసాద్‌రావు, డివిజన్ గణాంక అధికారి రమేశ్‌చందర్, నాగేశ్వర్‌రావు, ఎన్యూమరేటర్లు ఉన్నారు.


