పంటసాగులో సేంద్రియ ఉత్పత్తులు వాడాలి | - | Sakshi
Sakshi News home page

పంటసాగులో సేంద్రియ ఉత్పత్తులు వాడాలి

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

ఎల్కతుర్తి : పంటసాగులో రైతులు సేంద్రియ ఉత్పత్తులను వినియోగించి దిగుబడి సాధించాలని శాస్త్రవేత్త నాగభూషణం, శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం మండలంలోని కేశవాపూర్‌ గ్రామంలో గల రైతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని వర్షాకాలంలో సాగుచేసే పంటపై అవగాహన కల్పించారు. పంట అవశేషాలను నిప్పు పెట్టకుండా కాలుష్య నివారణ, పంట మార్పిడి చేసి ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు పొందాలని సూచించారు. కెమికల్‌ ఫెర్టిలైజర్‌ క్రమంగా తగ్గించుకుంటూ భూసారాన్ని పెంచుకోవాలని అన్నారు. ఆహార కొరత వల్ల అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఆర్‌ఎన్‌ఆర్‌, 1504, సిద్ధి, డబ్ల్యూజీఎల్‌ 962, కేఎన్‌ఎమ్‌118, ఎమ్‌టీయూ 1638, బీపీటీ 5204, దొడ్డు రకాలు కేఎన్‌ఎమ్‌118, ఎమ్‌టీయూ 1010 రకాన్ని సాగు చేయాలని రైతులకు సూచించారు. ఏఈఓ రోజా, రైతు సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సీఈఓ రాజు పాల్గొన్నారు.

శాయంపేట : రైతులు పంట సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించాలని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజు, కీటక విభాగ నిపుణురాలు డాక్టర్‌ రమ్యశ్రీ అన్నారు. మంగళవారం మండలంలోని సూరంపేట గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించి పలు సూచనలు చేశారు. సర్పంచ్‌ శశిపాల్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఏఈఓ రాకేశ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement