ధర్మసాగర్ : రైతుల సహకారంతో ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తి, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక తెలిపారు. పాడి పరిశ్రమ ద్వారా పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు స్పష్టం చేశారు. మండలంలోని ముప్పారం, నారాయణగిరి గ్రామ రైతులతో మంగళవారం స్థానిక కేజీబీవీలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వినూత్న ఆలోచనలతో పాడి పరిశ్రమ అభివృద్ధికి వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక దశలో రెండు గ్రామాల్లో రైతులను సహకార సంఘాలుగా ఏర్పాటు చేసి సబ్సిడీపై బ్యాంకు రుణాలతో గోవులు, గేదెలతో పాటు షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, మాజీ సర్పంచ్ గొ ల్లపల్లి వెంకట్రాజం, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త బిరుదరాజు కాంతంరాజు, డైరీ ప్రతినిధి సుబ్రహ్మణ్యం, ముప్పారం వార్డు సభ్యులు మల్లయ్య, గణేశ్, విజయ్ చందర్, చిట్యాల భరత్ పాల్గొన్నారు.


