ఉద్యమకారుల కమిటీకి కాలపరిమితి విధించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుల కమిటీకి కాలపరిమితి విధించాలి

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

దామెర : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేశవరావు కమిటీకి కాలపరిమితి విధించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందం డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా, కాలపరిమితి విధించి ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు. ఉద్యమ సమయంలో కేసులు లేకున్నా వారుచేసిన పోరాటం ప్రతిబంభించే ఫొటోలు, పేపర్‌ క్లిప్పింగులు పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరి న్యాయం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు పొలెపాక ఆరోగ్యం, ప్రధాన కార్యదర్శి గడ్డం సదానందం, జిల్లా యూత్‌ ప్రధాన కార్యదర్శి గోవిందు అశోక్‌, ఉద్యమకారులు దామెర కుమారస్వామి, కిన్నెర రమేశ్‌, ఇటికాల బాబురావు, కుంటమల్ల రాజు, మన్నెం ఇంద్రారెడ్డి, విజేందర్‌రెడ్డి, ఓయూ విద్యార్థి మాలతితో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement