మార్కెట్‌ చెర్మన్‌ పదవి మాదిగలకే ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ చెర్మన్‌ పదవి మాదిగలకే ఇవ్వాలి

May 19 2026 2:04 AM | Updated on May 19 2026 2:04 AM

హన్మకొండ చౌరస్తా : వరంగల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి స్థానిక కాంగ్రెస్‌ పార్టీ మాదిగ నాయకులకే కేటాయించాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా సీని యర్‌ కాంగ్రెస్‌ మాదిగ నాయకులు కోరారు. ఈ మే రకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే భవిష్యత్‌లో భర్తీ చేసే పలు నామినేటెడ్‌ పోస్టుల్లో కూడా మాదిగలకు సముచిత స్థానం కల్పించాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కో రారు. కలిసిన వారిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గంగారపు అమృతరావు, పసునూరి మనోహర్‌, అరూరి సాంబయ్య, చీటూరి అశోక్‌, చింత ప్రకాష్‌, డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌, గొర్రె మహేందర్‌, కొ మ్ముల బాబు, పుల్యాల గాంధీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement