కాజీపేట అర్బన్ : భానుడి భగభగకు కడిపికొండ గ్రామంలోని నాగుల చెరువు ఆవిరైపోయి చెరువు మట్టితో ఎండిపోయిన బుంగతో దర్శనమిస్తుంది. ఈ చెరువు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది, ఈ చెరువు క్రింద 250 ఎకరాల వ్యవసాయానికి ఆయకట్టుగా ఉంది. కాగా ఈ ఏడాది వేసవి కాలంలో ఎండల తీవ్రతతో 33 ఎకరాల చెరువు పూర్తిగా ఎండిపోయి కేవలం 5 ఎకరాల్లో కుంటలను తలపించే విధంగా నీరు ఉంది.
పారని సాగునీరు
చెరువు చుట్టు ఉన్న కాజీపేట, బోడగుట్ట, కడిపికొండ, దర్గా కాజీపేట పరిసర ప్రాంతాల్లోని సుమారు 250 ఎకరాల వ్యవసాయానికి సాగునీరు అందించే ఏకై క ఆధారం నాగుల చెరువు. వ్యవసాయానికి సాగు నీరు అందించేందుకు చెరువు ఎండిపోయి ఉండడం ఓ వైపు మరో వైపు గుర్రపు డెక్క ఆక్రమించి అది కూడా సూర్యుడి వేడికి ఎండిపోయి చెరువు బోసిగా దర్శనమిస్తోంది.వరుణుడి కరుణతో రాబో యే వర్షాకాలానికి చెరువు నిండితేనే రైతన్నకు వ్యవసాయం పండుతుంది.
ఆధారపడి జీవిస్తున్న 600 మత్స్యకార
కుటుంబాలు
ఊరిలోని చెరువుతో వ్యవసాయంతో పాటు చేపలను పట్టుకుంటూ మత్య్సకార కుటుంబాలు జీవి స్తుంటాయి. కడిపికొండలోను సుమారు 600 కు టుంబాలు తమ జీవనోపాధికి మార్గంగా నాగుల చెరువు నిలుస్తోంది. ఎండవేడిమితో ఎండిపోయిన నాగుల చెరువులో చేపలు జీవనం కొనసాగించలేకపోవడంతో మత్స్యకారుల జీవనం ప్రశ్నార్ధకంగా మారుతుంది.
33 ఎకరాల విస్తీర్ణంలో
పారని సాగునీరు
చెరువు కింద 250 ఎకరాల ఆయకట్టు
మట్టితో ఎండిపోయి బుంగతో దర్శనం ఇస్తున్న నాగుల చెరువు


