ఉద్యమకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలి

May 19 2026 2:04 AM | Updated on May 19 2026 2:04 AM

కేయూ క్యాంపస్‌ : తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ చరిత్రలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కీలకపాత్ర పోషించారని గల్లీ నుంచి ఢిల్లీవరకు ఉద్యమంలో నాడు కేయూ జేఏసీ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు ఆదివారం యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో సమావేశమై అయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం నియమించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని స్వాగతిస్తున్నామని వారు తెలి పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులుగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం వ రంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయినిరాజేందర్‌రెడ్డి వద్దకు వెళ్లి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కేయూ పూర్వ విద్యార్థి జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ సాధు రాజేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ 679 ద్వారా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించటం తెలంగాణ ఉద్యమాకారులకు ఇచ్చిన గౌరవమన్నారు.

సీఎం దృష్టికి తీసుకెళ్తాను : ఎమ్మెల్యే

కేయూ విద్యార్థి ఉద్యమకారుల వినతిని పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉద్యమకారులను డిమాండ్లను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమంలో నాటి కేయూ విద్యార్థి ఉద్యమకారులు డాక్టర్‌ చిర్రరాజు, డాక్టర్‌ వలీఉల్లాఖాద్రి, డాక్టర్‌ మంద వీరస్వామి, డాక్టర్‌ యాకూబ్‌రెడ్డి, డాక్టర్‌ ఫిరోజ్‌పాషా, డాక్టర్‌ సూత్రపు అనిల్‌, జోరిక రమేష్‌, మేడారపు సుధాకర్‌, పాలకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement