మిల్లు భూముల్లోనే ప్లాట్లు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

మిల్లు భూముల్లోనే ప్లాట్లు కేటాయించాలి

May 19 2026 1:58 AM | Updated on May 19 2026 1:58 AM

హన్మకొండ : అజంజాహి మిల్లు కార్మికులకు మిల్లు భూముల్లోనే ప్లాట్లు కేటాయించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. ఆదివారం హనుమకొండ వ డ్డేపల్లి రోడ్‌లోని పల్లా రవీందర్‌ రెడ్డి భవన్‌లో అ జంజాహి మిల్లు కార్మికుల సమావేశం జరిగింది. సమావేశంలో హరగోపాల్‌ మాట్లాడుతూ మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు కాలరాస్తున్నారని అన్నారు. కార్మికులది న్యా యమైన పోరాటమన్నారు. రాజకీయ నాయకులు మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను మభ్యపెట్టడం నాయకులకు అలవాటైపోయిందని విమర్శించారు. ముఖ్యంగా మిల్లు కార్మికులకు గత ఎన్నికల ముందు నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు మిల్లులో ఖాళీగా ఉన్న స్థలాన్ని కార్మికులకు ఇవ్వాలన్నారు. అజాంజాహి మిల్లు కార్మిక సంఘం–2002 అధ్యక్షుడు కొమ్ము సందీప్‌, ప్రధాన కార్యదర్శి బస్కుల హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు గంగుల దయాకర్‌, కార్మికులు సంజీవ యశోద, రవి, పౌరహక్కుల నేత ప్రవీణ్‌, సుధాకర్‌, తెలంగాణ జే ఏసీ నాయకులు డాక్టర్‌ కొణతం కృష్ణ పాల్గొన్నారు.

ప్రొఫెసర్‌ హరగోపాల్‌

Advertisement
 
Advertisement
Advertisement