కేయూ క్యాంపస్ : విద్యారంగ అభివృద్ధిని పాలకవర్గాలు విస్మరిస్తున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ విమర్శించారు. ఆదివారం కాకతీ య యూనివర్సిటీలో పీడీఎస్‌యూ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్ధలు ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ ఇతర పరీక్షల లీకేజీలపై సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నర్సింహారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు గణేష్, బో యినపెల్లి అజయ్, రాష్ట్ర కోశాధికారి అంగిడి కుమార్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పి.అనూష, తదితరులు పాల్గొన్నారు.


