పరకాల : ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి చదువుకు మాత్రమే సాధ్యమని, మనిషికి మూడో కన్ను విద్య అని పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ వారోత్సవాలను ఉద్దేశించి ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యా సాధికారితను సాధించేందుకు పట్టణ, పల్లె అంతరాలను తగ్గించేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పించిందన్నారు. విద్యా వారోత్సవాలను విజయవంతం కావడానికి కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.మల్లయ్య, ప్లేస్‌మెంట్ సెల్ కన్వీనక్ ఆర్.ఈశ్వరయ్య, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, ఆడెపు రమేష్, కల్పన, భీమ్‌రావు, బి.మహేంద్రరావు, కె.జగదీష్‌బాబు, ఎం.సమ్మయ్య, ఎస్.రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్


