పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

May 19 2026 1:58 AM | Updated on May 19 2026 1:58 AM

ఆటో లాగి సీపీఐ నాయకులు నిరసన

ఎల్కతుర్తి : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమీపం వద్ద సీపీఐ నాయకులు ఆటోకు తాడుకట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి పేదలు, సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు. కార్పొరేట్‌ రంగానికి, పెట్టుబడి దారులకు లక్షల కోట్ల రాయితీలు అందిస్తూ నిత్యావసరాల ధరలను సైతం పెంచే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉట్కూరి రాములు, మండల కార్యదర్శి శనిగరం రాజ్‌కుమార్‌, సహాయ కార్యదర్శి మర్రి విజయ్‌, తండ మొండయ్య, చంద్రమౌళి, మోహన్‌రెడ్డి, కర్రె లక్ష్మి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement