సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

May 19 2026 1:58 AM | Updated on May 19 2026 1:58 AM

కేయూ క్యాంపస్‌ : తెలంగాణా రాష్ట్ర ఉద్యమకారుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను స్వాగతిస్తూ ఆదివారం కాకతీయ యూనివర్సిటీ మొదటిగేట్‌వద్ద కాంగ్రెస్‌ నాయకులు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ మేడారపు సుధాకర్‌ ఇతర బాధ్యులు కలిసి సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడిన ఉద్యమకారులను గుర్తింపునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటం స్వాగతిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ బాధ్యులు గనిపాక క్రాంతికుమార్‌, సుధగాని మధు, అరుణ్‌కుమార్‌, రవి, సాయి, వెంకటేష్‌, అన్వేష్‌, రాజ్‌కుమార్‌, కుమారస్వామి, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

మిల్లు భూముల్లోనే

ప్లాట్లు కేటాయించాలి

హన్మకొండ : అజంజాహి మిల్లు కార్మికులకు మిల్లు భూముల్లోనే ప్లాట్లు కేటాయించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. ఆదివారం హనుమకొండ వ డ్డేపల్లి రోడ్‌లోని పల్లా రవీందర్‌ రెడ్డి భవన్‌లో అ జంజాహి మిల్లు కార్మికుల సమావేశం జరిగింది. సమావేశంలో హరగోపాల్‌ మాట్లాడుతూ మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు కాలరాస్తున్నారని అన్నారు. కార్మికులది న్యా యమైన పోరాటమన్నారు. రాజకీయ నాయకులు మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను మభ్యపెట్టడం నాయకులకు అలవాటైపోయిందని విమర్శించారు. ముఖ్యంగా మిల్లు కార్మికులకు గత ఎన్నికల ముందు నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు మిల్లులో ఖాళీగా ఉన్న స్థలాన్ని కార్మికులకు ఇవ్వాలన్నారు. అజాంజాహి మిల్లు కార్మిక సంఘం–2002 అధ్యక్షుడు కొమ్ము సందీప్‌, ప్రధాన కార్యదర్శి బస్కుల హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు గంగుల దయాకర్‌, కార్మికులు సంజీవ యశోద, రవి, పౌరహక్కుల నేత ప్రవీణ్‌, సుధాకర్‌, తెలంగాణ జే ఏసీ నాయకులు డాక్టర్‌ కొణతం కృష్ణ పాల్గొన్నారు.

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌

ఖిలా వరంగల్‌: వరంగల్‌ మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ బొల్లం రమేశ్‌ ఆధ్వర్యంలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సెంట్రల్‌జోన్‌ డీసీసీ ధార కవిత హాజరై వరంగల్‌ ఇన్‌చార్జ్‌ ఏసీపీ నర్సింహారావుతో కలిసి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రౌడీషీటర్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా, అల్లర్లు, భూ తగాదాల్లో ఇతర గొడవల్లో తలదూరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు

చదువుతో పాటు

క్రీడల్లో రాణించాలి

హసన్‌పర్తి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని ‘విద్యా విజయోత్సవం’కార్యక్రమం ఆదివారం జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ఎంఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రశంస పత్రాలతో పాటు శాలువలతో సత్కరించారు. పీఈటీ శ్రీధర్‌, పాల్గొన్నారు.

పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా ‘పట్టాభి’

కాజీపేట : కాజీపేటలో ఆదివారం జిల్లా మున్నురు కాపు సంఘం 11వ సంఘం విస్తృత స్థాయి సమావేశం బాసాని నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి మిడిపెల్లి పట్టాభి సంఘం వార్షిక నివేదికను నివేదించారు. మున్నురు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రవికుమార్‌, రిటైర్డ్‌ సభ్యులు సుంకరి వేణుగోపాల్‌, రవీందర్‌, నారయణరావులతో పాటు పాత కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా పట్టాభి, ప్రధాన కార్యదర్శిగా నర్సింగరావు, కోశాధికారి సిరిపురి సత్యనారాయణలు ఎంపికయ్యారు. సంఘం నియమాలకు కట్టుబడి ఉంటామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement