పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

May 19 2026 1:58 AM | Updated on May 19 2026 1:58 AM

వేలేరు : మండలంలోని మల్లికుదుర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991–92 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 35 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అందరు కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబోధన చేసిన గురువులను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఆయా రంగాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచిన విద్యార్థులను చూసి గురువులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షుకూర్‌, కిష్టయ్య, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఐనవోలులో..

ఐనవోలు : మండల కేంద్రంలోని పాఠశాలలో 2000–01లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఐనవోలులోని ఓ గార్డెన్‌లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు సుదీర్ఘ కాలం తర్వాత ఒకచోట కలుసుకుని, చిన్ననాటి జ్ఞాపకరాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆప్యాయతల మధ్య సామూహికంగా భోజనం చేసి, నృత్యాలతో సందడి చేశారు. అప్పటి గురువులను పూజించుకుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు రంగారావు, వీరారెడ్డి, ఉపాధ్యాయులు దివాకర్‌రెడ్డి, లక్ష్మీనర్సయ్య, ఆనంద్‌బాబు, జనార్ధన్‌ రెడ్డి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement