ఉత్తమ విద్యార్థులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ విద్యార్థులకు సన్మానం

May 19 2026 1:58 AM | Updated on May 19 2026 1:58 AM

ఐనవోలు : పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులను ఆదివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌ గౌడ్‌ సత్కరించారు. నందిని 545, ఆర్‌.వరుణ్‌ సందేశ్‌ 542, టి.మేఘన 539 సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి మూడు ర్యాంకులను కై వసం చేసుకున్నారు. వీరంతా ఒంటిమామిడిపల్లి పాఠశాలకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డాక్టర్‌ శివకుమార్‌, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ కడుదూరి మోహన్‌, పీఈటీ గణేష్‌, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

శాయంపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇంటర్‌ విద్యా వారోత్సవాలల్లో చివరిరోజు ఆదివారం హనుమకొండలోని కోఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి అజ్మీరా గోపాల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని టాపర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 967మార్కులు సాధించిన అంకం భానుశ్రీ, 965 మార్కులు సాధించిన బూర వరుణ్‌, 964 మార్కులు సాధించిన కందగట్ల విజయ్‌ కుమార్‌లతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించినట్లు శాయంపేట కళాశాల ప్రిన్సిపాల్‌ కందగట్ల కోటేష్‌ తెలిపారు.

ఉపాధ్యాయురాలికి ప్రశంస

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన విద్యాశాఖ వారోత్సవాల్లో జిల్లా నుంచి మండలంలోని పత్తిపాక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అంజనీదేవి ఏకపాత్రాభినయం, బంజారా నృత్య ప్రదర్శన చేసినందుకు పలువురు ఆమెను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎంఈఓ గడ్డం భిక్షపతి, పత్తిపాక కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలు మాధవి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రాజయోగేందర్‌, కార్యదర్శి సుధాకర్‌ రాథోడ్‌, ఉపాధ్యాయులు అంజనీదేవిని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement