ఐనవోలు : సనాతన ధర్మాన్ని పాటించడంతో పాటు రక్షించడం ప్రజలందరి బాధ్యత అని సద్గురు లక్ష్మీనారాయణ గురుభవాని తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలో ఐనవోలు ఉప మండలం హిందూ ధర్మ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందు ధర్మ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా లక్ష్మీనారాయణ గురుభవాని హాజరై మాట్లాడుతూ.. హిందూ ధర్మం ఎవరికి హానికరం కాదని ప్రతీ ఒక్కరిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందన్నారు. దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజమన్నారు. హిందూ సమాజాన్ని చైతన్యం చేసి సమైక్య పరిచి దేశాన్ని విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వధర్మం పట్ల ప్రతీ ఒక్కరు అంకితభావాన్ని కలిగి ఉండాలన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే భగవద్గీత, రామయణం, మహాభారతం వంటి అంశాలను బోధించాలని తల్లిదండ్రులకు సూచించారు. హిందువుల ఐక్యతే జాతీయ సమైక్యత అని అన్నారు. హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి, పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం అన్నారు. అనంతరం స్వామిజీని నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో కుటుంబ ప్రభోధన్ విభాగ్ సంయోజక్ రాచకట్ల లక్ష్మణ్ సుధాకర్, సర్పంచ్‌లు గడ్డం రఘువంశీ, ఆడెపు స్రవంతి, జన్నపురెడ్డి దేవిక, అడ్డగూడి సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక రిజర్వేషన్లు
అమలు చేయాలి
కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ చరిత్రలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కీలకపాత్ర పోషించారని గల్లీ నుంచి ఢిల్లీవరకు ఉద్యమంలో నాడు కేయూ జేఏసీ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు ఆదివారం యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో సమావేశమై అయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం నియమించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని స్వాగతిస్తున్నామని వారు తెలి పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులుగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం వ రంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయినిరాజేందర్‌రెడ్డి వద్దకు వెళ్లి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు.


