ఉద్యమకారులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులకు న్యాయం చేయాలి

May 19 2026 1:58 AM | Updated on May 19 2026 1:58 AM

ఆత్మకూరు : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఏర్పాటైన కేశవరావు కమిటీ ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్సడ్ల సదానందం పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల హామీలను నెరవేర్చడానికి కేశవరావు ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కేసులు లేని వారిని కూడా ఉద్యమకారులుగా పరిగణించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండీ బాబుమియా, ప్రధాన కార్యదర్శి దొంకదువ్వ రాజయ్య, కోటయ్య, కోర్నెల్‌, ఇమానియల్‌, సాంబరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement