మేము ఇద్దరం అక్కచెల్లెలము. మాది పోచారం గ్రామం. 70 క్వింటాళ్ల మక్కలను అమ్మేందుకు తీసుకొచ్చాం. మొదట గన్నీ సంచులు లేవని పీఏసీఎస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రూ.1500 ఖర్చు చేసి సంచులు కొనుగోలు చేసి మక్కలు నింపాం. కొనుగోలు చేయమంటే వారం రోజులుగా లారీలు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. వృత్తిలో భాగంగా గొర్రెలు మోపుతాము. రోజుల తరబడి పీఏసీఎస్ వద్దే ఉండడంతో మూగజీవాలు ఇంటి వద్దనే ఉంటున్నాయి. వెంటనే కాంటా పెట్టాలి.
– దౌడ సమ్మక, పోచారం, రైతు
500 క్వింటాళ్ల ధాన్యం విక్రయించేందుకు తీసుకొచ్చాను. గన్నీ సంచులు కావాలంటే పీఎసీఎస్ అధికారులు కొంత ఆలస్యం అవుతుందని అంటున్నారు. లారీలు తక్కువగా వస్తుండటంతో కాంటా పెట్టడం ఆలస్యమవుతుంటే గన్నీ సంచులు ఇవ్వడం లేదు. లారీలు ఎక్కువగా తెప్పించి కాంటా తొందరగా చేపట్టాలి. గాలిదుమారంతో భయాందోళన చెందుతున్నాం. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందోనని భయం వేస్తోంది. అధికారులు, పాలకులు ఇప్పటికై నా రైతుల ఇబ్బందులపై దృష్టి సారించాలి.
– బాపురావు, రైతు


