దామెర : గీత కార్మికుడిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి చెందిన చిర్ర రమేశ్‌గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడగా కుడి కాలు విరగడంతో పాటు తీవ్రగాయలైనట్లు తెలిపారు. ఈ మేరకు సంఘం నాయకులు సోమవారం బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగితెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఆయన వెంట రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌని సాంబయ్య గౌడ్, బొల్లెపల్లి అనిల్‌గౌడ్ ఉన్నారు.


