నేడు విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌

May 19 2026 1:58 AM | Updated on May 19 2026 1:58 AM

ఉండని ప్రాంతాలు

హన్మకొండ : హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 19న విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్‌ హ నుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబరెడ్డి తెలి పారు. విష్ణుపురి మెయిన్‌రోడ్‌, సోమిడిలోని ఉప్పలయ్య డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు.

వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్‌ వరంగల్‌ టౌన్‌ డీఈ శెంకేశి మల్లికార్జున్‌ తెలిపారు. స్తంభంపల్లి, ధర్మారం ప్రాంతంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు.

23 వరకు సెల్ఫ్‌

రిపోర్టింగ్‌ సమర్పించాలి

కేయూ క్యాంపస్‌ : డిగ్రీ కోర్సుల్లో ఈవిద్యా సంవత్సరం 2026–27లో దోస్త్‌ ద్వారా మొదటి దశలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 23 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ను స మర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి సోమవారం కోరారు. మొదటిదశలో కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఆనర్స్‌, బీఏ జర్నలిజం తదితర కోర్సుల్లో మొత్తం 1225 మంది విద్యార్థులకు సీట్లు లభించాయని ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసేందుకు ఈనెల 23 వరకు గడువు ఉందన్నారు. రిపోర్టింగ్‌ చేసిన విద్యార్థులకే అడ్మిషన్‌ ప్రక్రియను పూ ర్త్తయినట్లుగా పరిగణిస్తారని తెలిపారు. రెండోదశలో ఈనెల 25వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

న్యూశాయంపేట : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సోమవారం సీఐటీయూ అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ హనుమకొండ జిల్లా కమిటీ ఆద్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కే.ఆర్‌.నాగరాజులను కలిసి వినతి పత్రాలు అందించారు. వర్కర్లకు ప్రతి నెలా 1వ తేదీన పారి తోషికాలు అందించాలని రూ.18వేల ఫిక్స్‌డ్‌ వేతనా లు అందించాలని వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం అందించిన వారిలో సీఐటీయూ నాయకులు రాగుల రమేష్‌, యూనియన్‌ నాయకులు రాజేశ్వరీ, యాకూబి, శోభ, శ్రీవాణి, లీల, పద్మ, తదితరులు ఉన్నారు.

కాశిబుగ్గ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఉద్యమకారుల విజయమని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25వేల గౌరవ పెన్షన్‌, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి, 250 గజాల ఇళ్ల స్థలాల హామీని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

మహిళలు

మనో నిబ్బరాన్ని కోల్పోవద్దు

కాజీపేట : మహిళలు జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైన ఆత్మస్తైర్యాన్ని కోల్పోవద్దని సఖి సెంటర్‌ లీగల్‌ కౌన్సిలర్‌ శ్రీదేవి అన్నారు. పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవనంలో సోమవారం సఖి ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత మహిళలకు అన్ని వేళల్లో చేయూతనందించడానికి సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలకు ఇబ్బందులు కలిగితే 181, 100, 1098 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు. అనంతరం సఖి వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో సోషల్‌ వర్కర్‌ అనూష, లక్ష్మి, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.

ఆధునికీకరించిన ఆఫీస్‌లోకి రిజిస్ట్రార్‌

కేయూ క్యాంపస్‌ : కాకతీ య యూనివర్సిటీలోని ప రిపాలనా భవనంలోని మొదటి అంతస్తులో నూతనంగా ఆధునికీకరించిన ఆఫీస్‌ను రిజిస్ట్రార్‌ ప్రొఫె సర్‌ వి.రామచంద్రం సోమవారం ప్రారంభించారు. పాత వీసీ చాంబర్‌ను ఆధునీకరించగా అందులోనికి రిజిస్ట్రార్‌ చాంబర్‌, పేషీగా మార్చారు. ఇక నుంచి ఈ ఆ ఫీస్‌లోనే రిజిస్ట్రార్‌ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్‌ చాంబర్‌, పేషీని ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ) ఇటీవలే నియమితులైన వెంకట్రామ్‌రెడ్డికి కేటాయించారు. వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి ఆయా చాంబర్లకు వెళ్లి రిజిస్ట్రార్‌కు, వెంకట్రామ్‌రెడ్డికి పూలబొకే అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement