సంక్షిప్త సమాచారం
శాయంపేట : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల టీజీఐఆర్‌డీలో ఈనెల 15 నుంచి 17 వరకు రాష్ట్రస్థాయి తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ సమావేశం నిర్వహించగా హనుమకొండ జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపాల్ రేవతి తెలిపారు. యూఎన్‌ఈఏ కమిటీలో రాష్ట్రస్థాయిలో 10 మంది ఉత్తమ విద్యార్థి ప్రతినిధులను ఎంపిక చేయగా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలురు గురుకుల పాఠశాలకు చెందిన సాయిచరణ్ ఆల్జీరియా దేశ ప్రతినిధిగా పాల్గొని రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రతినిధిగా ఎంపికై నట్లు పేర్కొన్నారు. సాయిచరణ్‌ను, గైడ్ టీచర్ సుభాశ్‌చందర్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.
శాయంపేట : సీఐగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్‌రెడ్డిని సోమవారం నేరేడుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కూరి భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఆయన వెంట నాయకులు రాజేశ్, మురళి, సమ్మయ్య ఉన్నారు.
జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు
శాయంపేట : టీయూబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నూతన కమిటీలో మండలానికి చెందిన ఇద్దరు పాత్రికేయులకు చోటు లభించింది. మండల కేంద్రానికి చెందిన గన్ను సంతోశ్‌కుమార్ జిల్లా జాయింట్ సెక్రటరీగా, మైలారం గ్రామానికి చెందిన రంగు శ్రీధర్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై య్యారు.
రైసింగ్ స్టార్
యూత్ సభ్యుల సాయం
దామెర : బాధిత కుటుంబానికి రైసింగ్ స్టార్ యూత్ సభ్యులు బాసటగా నిలిచారు. మండల కేంద్రానికి చెందిన దేవమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందింది. కాగా గ్రామానికి చెందిన రైజింగ్ స్టార్ యూత్ సభ్యులు స్పందించి సోమవారం బాధిత కుటుంబానికి 25వేల ఆర్థిసాయం అందించారు. వేల్పుల రాజ్‌కుమార్, వార్డు సభ్యుడు దామెర అఖిల్, నితిన్, మంద కట్టయ్య, దౌడు సురేష్, దామెర లక్ష్మీనారాయణ, దామెర సతీశ్, ఈసంపల్లి సందీప్, ఎడ్ల ప్రణయ్, దామెర నరేష్, ప్రేమ్‌కుమార్, మామిడి వేణు ఉన్నారు.
ఆయిల్‌పాం చెట్లు, డ్రిప్ పైపుల దగ్ధం
ఆత్మకూరు : మొక్కజొన్న చొప్ప కాల్చే క్రమంలో మంటలు అంటుకొని ఆయిల్‌పాం చెట్లు , డ్రిప్ పైపులు దగ్ధమైన సంఘటన మండలంలోని అక్కంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత రైతు యాసాల రవీందర్ కథనం ప్రకారం.. తన భూమి సమీపంలో ఓ రైతు మొక్కజొన్న చొప్ప కాలుస్తున్న క్రమంలో మంటలు వ్యాపించి తన ఆయిల్ పాంలోని 24 చెట్లతో పాటు, డ్రిప్ పైపులు దగ్ధమయ్యాయని వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రూ.2లక్షల నష్టం వాటిల్లిందని వాపోయాడు.


