పరకాల : ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు మక్కలు, మరోవైపు ధాన్యం రాసులతో పరకాల వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. లారీలు రాకపోవడం, గన్నీ సంచుల కొరత రైతులను కలవరపెడుతోంది. గాలిదుమారం వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్ వద్ద ధాన్యం విక్రయించుకునేందుకు వచ్చిన రైతులు వారం, పదిరోజులుగా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆగ్రహిస్తున్నారు.
దండం పెడతాం సారు..
శాయంపేట : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి లారీలు రావడంలేదని సోమవారం మధ్యాహ్నం ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు రోడ్డుపై నిరసనకు దిగారు. మాందారిపేట స్టేజి వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు చేరుకొని సముదాయించే ప్రతయ్నం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకచ్చి 20 రోజులు గడుస్తుందని, కాంటా అయినా లారీల కొరత ఉండడంతో అక్కడే ఉంటున్నామని, దండం పెడుతాం లారీలు పంపాలని రైతులు పోలీస్‌లను వేడుకున్నాడు. రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వేడుకున్నారు. ఈ ఆందోళనలో రైతులు ఈదేందర్, సదానందం, మల్లెశంతో పాటు తదితరులు పాల్గొన్నారు
కాంటా పెట్టని నిర్వాహకులు
వరి, మొక్కజొన్న రైతుల ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు


