ఉత్సాహంగా మారథాన్‌ 2కే రన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా మారథాన్‌ 2కే రన్‌

May 19 2026 1:58 AM | Updated on May 19 2026 1:58 AM

దామెర : మండల కేంద్రంలో సోమవారం 2కే మారథాన్‌ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎంపీడీఓ గమ్మడి కల్పనతో పాటు అధికారులు సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గరిగె కల్పనాకృష్ణమూర్తి, ఎంపీఓ రంగాచారి, ఎంఈఓ లకావత్‌ రాజేశ్‌కుమార్‌, ఎస్సై రమేశ్‌, పంచాయతీ కార్యదర్శులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఐనవోలు : యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎంఈఓ పులి ఆనందం అన్నారు. సోమవారం మండలంలోని పంథిని ప్రభుత్వ పాఠశాలలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా మారథాన్‌, యోగా నిర్వహించారు. ఎంపీడీఓ నర్మద హాజరై ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిత్య జీవితంలో యోగా, వ్యాయామం తప్పనిసరి అన్నారు. సర్పంచ్‌ శ్రీరాం భూపాల్‌రావు, పంచాయతీ కార్యదర్శి మాలతి, దఽశరథం, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది, పీఈటీ, యూత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు : మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి మండల పరిషత్‌ కార్యాలయం వరకు మంగళవారం 2కే మారథాన్‌ నిర్వహించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తహసీల్దార్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ మహేశ్వరిరాజు, ఎంఈఓ విజయ్‌కుమార్‌, ఎంపీఓ యోగిత, ఈజీఎస్‌ ఏపీఓ రాజిరెడ్డి, హెచ్‌ఎం రాజు, పంచాయతీ కార్యదర్శి శ్వేత, ఉప సర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తి : ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలో సోమవారం 2కే మారథాన్‌ కార్యక్రమాన్ని ఎంపీడీఓ విజయ్‌కుమార్‌, ఎంఈఓ సత్యనారాయణ ప్రారంభించారు. నడక, యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో యోగా, వ్యాయామం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు 2కే మారథాన్‌ నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వేలేరు : క్రీడలతోనే యువతలో మానసికోల్లాసం కలుగుతుందని వేలేరు సర్పంచ్‌ బిల్లా యాదగిరి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్‌ మారథాన్‌, 2కే రన్‌ వాకింగ్‌ నిర్వహించారు. ఎంఈఓ చంద్రమౌళి, ఎంపీఓ అప్జల్‌, ఏపీఓ విజయ, హౌసింగ్‌ ఏఈ అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement