అభివృద్ధి పనులకు ‘కడియం’ నిధుల వరద | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు ‘కడియం’ నిధుల వరద

May 19 2026 1:58 AM | Updated on May 19 2026 1:58 AM

ఎస్డీఎఫ్‌ నుంచి రూ.18.70 లక్షలు మంజూరు

ధర్మసాగర్‌ : ధర్మసాగర్‌, వేలేరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వివిధ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఎస్డీఎఫ్‌ నిధుల నుంచి కోటి 18లక్షల 70వేల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించారు. మంజూరు పత్రాలను ఆయా కుల సంఘాల నాయకులకు హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం అందించారు. వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.5 లక్షలు, మల్లికుదుర్ల గ్రామంలో అసంపూర్తిగా ఉన్న యాదవ కమ్యూనిటీ భవనానికి రూ.5 లక్షలు, ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి రూ.5 లక్షలు, వేలేరు మండల కేంద్రంలో మజీద్‌ ప్రహరీ నిర్మాణానికి రూ.5 లక్షలు, ధర్మసాగర్‌ మండలంలోని ముప్పారం వాగుపై తాత్కాలిక కట్ట నిర్మాణానికి రూ.7 లక్షల 50వేలు, కస్తూర్బా గాంధీ పాఠశాల దగ్గర సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.16 లక్షల 30వేలు, మల్లక్‌పల్లిలో ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికిర రూ. 5లక్షలు, ఆరే కమ్యూనిటీ హాల్‌కు రూ.5లక్షలు, నూతన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.5 లక్షలు, శ్మశాన వాటిక ఆఫీస్‌ రూమ్‌, వేయిటింగ్‌ రూమ్‌, టాయిలెట్స్‌ నిర్మాణానికి రూ.5 లక్షలు, ఎల్కుర్తి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న మహిళా కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.10 లక్షలు, ఐనవోలు మండలంలో గర్నేపల్లిలో అసంపూర్తిగా ఉన్న మహిళా కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.5 లక్షలు, వెంకటాపూర్‌లో అసంపూర్తిగా ఉన్న ఆరే కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.5లక్షలు చేసి పత్రాలు అందించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement