3,360 బస్సులు.. 5,772 ట్రిప్పులు | - | Sakshi
Sakshi News home page

3,360 బస్సులు.. 5,772 ట్రిప్పులు

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి..

హన్మకొండ: సరస్వతి అంత్య పుష్కరాల కు టీజీఎస్‌ ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ నెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమస్థలమైన పవిత్ర క్షేత్రం కాళేశ్వరంలో అంత్యపుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం టీజీఎస్‌ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరంలోని 4.36 ఎకరాల్లో భక్తుల కోసం ప్రభుత్వం తాత్కాలిక బస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ చలువపందిళ్లు వేయించింది. మిషన్‌ భగీ రథ (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ తాగునీటి సౌకర్యం కల్పిస్తుంది. విద్యుద్దీకరణ పనులు ఆర్టీసీ చేపట్టింది. ఈ నెల 20 నాటికి కాళేశ్వరంలో ఆర్టీసీ బస్‌పాయింట్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తికా నున్నాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్‌ షెడ్లు, సిబ్బంది విశ్రాంతి గదులు తాత్కాలిక బస్‌ స్టేషన్లో ఏర్పాట్లు చేశారు.

ప్రతీ రోజు 125 బస్సులు,

సెలవు రోజుల్లో 145 బస్సులు..

టీజీఎస్‌ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి జూన్‌ 1 వరకు మొత్తం 3,360 బస్సుల ద్వారా 5,772 ట్రిప్పులు నడపాలని నిర్ణయం తీసుకుంది. వరంగల్‌ రీజి యన్‌లో మొత్తం 1,580 బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. వరంగల్‌ రీజియన్‌లోని 9 డిపోల నుంచి ప్రత్యేక బ స్సులు నడిపేలా కార్యాచరణ సిద్ధం చేశా రు. ప్రస్తుతం హనుమకొండ–కాళేశ్వరం మార్గంలో భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, హనుమకొండ, వరంగల్‌–1, వరంగల్‌–2 డిపోల ద్వారా 59 బస్సులు నడుస్తున్నాయి. పుష్కరాల సందర్భంగా ఈ నెల 21 నుంచి ప్రతీ రోజు 125 ప్రత్యేక బస్సులు, సెలవు రోజుల్లో రోజుకు 145 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. ప్రతీ రోజు వరంగల్‌–1 డిపో 20 బస్సులు, వరంగల్‌–2 డిపో 25, హనుమకొండ 20, జనగామ 10, పరకాల 10, నర్సంపేట 10, తొర్రూరు 5, మహబూబాబాద్‌ డిపో నుంచి 5 బస్సులు నడపనున్నారు. పర్యవేక్షణ కోసం రెండు మొబైల్‌ టూవీలర్‌ పెట్రోలింగ్‌ పార్టీలను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వలంటీర్లను నియమించా రు. కాళేశ్వరం తాత్కాలిక బస్‌స్టేషన్‌ వద్ద క్యాంటీన్‌ సౌకర్యం కల్పిస్తున్నారు.

సరస్వతి అంత్య పుష్కరాలకు

ఆర్టీసీ సన్నద్ధం

ఈనెల 21 నుంచి ప్రత్యేక బస్సులు

కాళేశ్వరంలో 4.36 ఎకరాల్లో

బస్‌పాయింట్‌

సరస్వతి అంత్య పుష్కరాలకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షిత, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే క్షేమంగా ప్రయాణించి మొక్కలు తీర్చుకోవాలి. ప్ర స్తుతం నడపనున్న బస్సులతో పాటు అవసరమైతే భక్తుల రాకను బట్టి అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు సమకూర్చి త్వరితగతిన చేరవేస్తాం.

ఎస్‌.భవాని ప్రసాద్‌,

ఆర్టీసీ వరంగల్‌ ఆర్‌ఎం

Advertisement
 
Advertisement
Advertisement