సమగ్ర వివరాలు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర వివరాలు నమోదు చేయాలి

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

సమగ్ర వివరాలు నమోదు చేయాలి

హన్మకొండ అర్బన్‌: జనగణనలో ప్రతీ కుటుంబానికి సంబంధించిన సమగ్ర, వా స్తవ వివరాలను నమోదు చేయాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్‌ భారతి హోళికేరి ఆదేశించారు. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ వంటి కీలక నిర్ణయాలకు జనగణన డేటా ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల జనగణన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ.. ‘సెన్సెస్‌ ఈజ్‌ ది మదర్‌ ఆఫ్‌ ఆల్‌ సర్వేస్‌’ అని పేర్కొంటూ, డేటా నమోదు అద్దంలా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించా లన్నారు. హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్‌, సత్యశారద మా ట్లాడుతూ అన్ని మండలాల్లో జనగణన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందన్నారు.

మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్‌

జనగణన–2027 ప్రక్రియ పరిశీలన నిమి త్తం హనుమకొండ జిల్లాకు వచ్చిన రాష్ట్ర జనగణన డైరెక్టర్‌ భారతి హోళికేరికి కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సోమవారం హరిత కాకతీయ హోటల్‌లో పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

పారదర్శకంగా జనగణన

హన్మకొండ: జనగణన–2027 ప్రక్రియ ను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్‌ భారతి హోళికేరీ సూ చించారు. సోమవారం హనుమకొండ క లెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి హనుమకొండలోని ఎకై ్సజ్‌ కాలనీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న హౌస్‌ లిస్టింగ్‌, డిజిటల్‌ మ్యాపింగ్‌, గృహాల నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. సీపీఓ సత్యనారాయణరెడ్డి, హనుమకొండ తహసీల్దా ర్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ అధికారులు శ్రీను, జనగణన విభాగ సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

రాష్ట్ర జనగణన డైరెక్టర్‌ భారతి హోళికేరి

అధికారులతో సమీక్ష

Advertisement
 
Advertisement
Advertisement